Skip to main content

గిరిజన హక్కుల కార్యకర్త స్టాన్‌ స్వామి కన్నుమూత

ఎల్గార్‌ పరిషత్‌ కేసులో నిందితుడిగా ఉన్న గిరిజన హక్కుల కార్యకర్త స్టాన్‌ స్వామి(84) జూలై 5న మృతి చెందారు.
Current Affairs అనారోగ్య కారణాలతో బెయిల్‌ మంజూరు చేయాలన్న ఆయన విజ్ఞప్తిపై బొంబాయి హైకోర్టులో విచారణ కొనసాగుతుండగానే ముంబైలోని హోలీ ఫ్యామిలీ ఆసుపత్రిలో కన్నుమూశారు. కోవిడ్‌కు చికిత్స పొందుతూ గుండెపోటు కారణంగా తుదిశ్వాస విడిచారు. రోమన్‌ కేథలిక్‌ ప్రీస్ట్‌గా ఉన్న స్టాన్‌ స్వామిని... ఎల్గార్‌ పరిషత్‌–మావోయిస్ట్‌ సంబంధాలకు సంబంధించిన కేసులో, కఠినమైన చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ) కింద 2020 అక్టోబర్‌ నుంచి విచారణ ఖైదీగా నిర్బంధించారు.

ఆదివాసీల కోసం 30 ఏళ్ల పోరాటం...
  • ఫాదర్‌ స్టాన్‌ స్వామి పూర్తి పేరు స్టానిస్లాస్‌ లూర్దుసామి.
  • తమిళనాడులోని తిరుచిరాపల్లిలో 1937లో ఆయన జన్మించారు.
  • ‘జంషెడ్‌పూర్‌ ప్రావిన్స్‌ ఆఫ్‌ ద సొసైటీ ఆఫ్‌ జీసస్‌’లో చేరి, ప్రీస్ట్‌గా మారారు.
  • 1970లలోనే యూనివర్సిటీ ఆఫ్‌ మనీలాలో సోషియాలజీలో పీజీ చేశారు.
  • 30 ఏళ్లుగా జార్ఖండ్‌లోని ఆదివాసీలు, అణగారిన వర్గాల హక్కుల కోసం కృషి చేశారు.
  • గిరిజనుల భూములను అభివృద్ధి పేరుతో డ్యాములు, గనులు, టౌన్‌షిప్‌ల కోసం తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ పోరాటం చేశారు.
  • నక్సలైట్లను ముద్రవేసి అక్రమంగా జైళ్లో మగ్గుతున్న ఆదివాసీల దుస్థితిపై ఒక పరిశోధన గ్రంథం రాశారు.
  • 1975 నుంచి 1986 వరకు బెంగళూరులోని ఇండియన్‌ సోషల్‌ ఇన్‌స్టిట్యూట్‌కు డైరెక్టర్‌గా పనిచేశారు.
  • బ్రసెల్స్‌లో చదువుకుంటున్న సమయంలో బ్రెజిల్‌లోని పేదల కోసం కృషి చేస్తున్న ఆర్చ్‌ బిషప్‌ హోల్డర్‌ కామరా సేవలు ఆయనను అమితంగా ఆకర్షించాయి.
  • నక్సలైట్లతో సంబంధాలున్నాయన్న తప్పుడు ఆరోపణలతో జైళ్లలో మగ్గుతున్న గిరిజన యువత విడుదలకి కృషి చేశారు.

క్విక్‌ రివ్యూ :
ఏమిటి : గిరిజన హక్కుల కార్యకర్త కన్నుమూత
ఎప్పుడు : జూలై 5
ఎవరు : స్టాన్‌ స్వామి(84)
ఎక్కడ : హోలీ ఫ్యామిలీ ఆసుపత్రి, ముంబై, మహారాష్ట్ర
ఎందుకు : కోవిడ్‌కు చికిత్స పొందుతూ గుండెపోటు కారణంగా...
Published date : 06 Jul 2021 06:30PM

Photo Stories