గగన్‌యాన్‌పై డీఆర్‌డీవోతో ఇస్రో ఒప్పందం
Sakshi Education
భారత్ తొలిసారిగా చేపట్టే తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర ‘గగన్‌యాన్’పై రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో)తో ఇస్రో పలు ఒప్పందాలను కుదుర్చుకుంది.
ఈ ఒప్పందాలపై ఇస్రో శాస్త్రవేత్తలు, డీఆర్‌డీవో డెరైక్టర్లు సెప్టెంబర్ 17న సంతకాలు చేశారు. తాజా ఒప్పందంలో భాగంగా వ్యోమగాములకు అంతరిక్షంలో అందించాల్సిన ఆహారం, రేడియోధార్మికతపై కొలతలు, రక్షణ, ఆరోగ్య పర్యవేక్షణ వంటి అంశాల్లో డీఆర్‌డీవో కీలక పరిజ్ఞానాలను అందజేస్తుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : గగన్‌యాన్‌పై డీఆర్‌డీవోతో ఒప్పందం
ఎప్పుడు : సెప్టెంబర్ 17
ఎవరు : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో)
క్విక్ రివ్యూ :
ఏమిటి : గగన్‌యాన్‌పై డీఆర్‌డీవోతో ఒప్పందం
ఎప్పుడు : సెప్టెంబర్ 17
ఎవరు : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో)
Published date : 18 Sep 2019 06:27PM