Skip to main content

Financial Assistance to Veteran Artists: వెటరన్ ఆర్టిస్ట్‌లకు ఆర్థిక సహాయం

"వెటరన్ క‌ళాకారుల‌కు ఆర్థిక సహాయం" అనే ప‌థ‌కం క్రింద ప్రముఖ కళాకారులకు ఆర్థిక సహాయం అందించడం కోసం సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, కెనరా బ్యాంక్ మధ్య అవగాహన ఒప్పందం (MOU) జ‌రిగింది.
Memorandum of Understanding
Memorandum of Understanding

సాంస్కృతిక మంత్రిత్వ శాఖ "వెటరన్ ఆర్టిస్ట్‌లకు ఆర్థిక సహాయం" అనే పథకం ద్వారా 60 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న కళాకారులు, పండితులకు నెలకు రూ.6000/- అందిస్తుంది.
ప్రస్తుతం ఈ పథకం కింద 2017 కంటే ముందు ఎంపికైన కళాకారులకు సంబంధించి ఆర్థిక సహాయం LIC ద్వారా పంపిణీ చేయబడుతుంది, అయితే 2017 తర్వాత ఆమోదించబడిన కళాకారుల కోసం ఆర్థిక సహాయం నేరుగా మంత్రిత్వ శాఖ ద్వారా చేయబడుతున్న‌ది.
లబ్దిదారుల నుండి పత్రాలు తరచుగా ఆలస్యం అవుతున్న‌నందున‌, ఆర్థిక సహాయం క్రమ పద్ధతిలో విడుదల కాకుండా ఏకమొత్తంగా పంపిణీ చేయబడుతున్న‌ది. కెనరా బ్యాంక్‌తో అవగాహన ఒప్పందంపై సంతకం చేయడంతో, ప్రక్రియను క్రమబద్ధీకరించిన సుమారు రెండు నెలల వ్యవధిలో, అనుభవజ్ఞులైన కళాకారులకు ఆర్థిక సహాయం పంపిణీ నెలవారీ ప్రాతిపదికన ప్రారంభమవుతుందని సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తెలిపింది. 

☛ Daily Current Affairs in Telugu: 29 జూన్ 2023 క‌రెంట్ అఫైర్స్

Published date : 29 Jun 2023 06:46PM

Photo Stories