Skip to main content

ఏవరి నేతృత్వంలోనిబృందం కోవిడ్ టీకా పంపిణీ విధానాన్ని రూపొందించింది?

కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే దాని పంపిణీ, టీకా డోసులు ఏ దేశానికి ముందు ఇవ్వాలన్న అంశంపై 19 మందితో కూడిన అంతర్జాతీయ ఆరోగ్య నిపుణుల బృందం ఒక విధానాన్ని రూపొందించింది.
Current Affairs

పెన్సిల్వేనియా యూనివర్సిటీకి చెందిన ఎజెకీల్ జే ఎమ్మన్యూల్ నేతృత్వంలోని ఈ బృందం పలు దశల్లో వ్యాక్సిన్ పంపిణీకి పలు సూచనలు చేసింది. కోవిడ్-19 ద్వారా వచ్చే ఆరోగ్య సమస్యలు, ఎవరిపై ఎక్కువగా వైరస్ దాడి చేస్తోంది, మరణాల నియంత్రణ వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని ఈ విధానాన్ని రూపొందించారు. ప్రపంచంలో అన్ని దేశాలకు ప్రాధాన్యతనిస్తూ టీకా పంపిణీ చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే సంపన్న దేశాలకు సూచించిన విషయం తెలిసిందే.

నిపుణుల బృందం-సూచనలు

  • కరోనా వైరస్‌తో అత్యధికంగా మరణాలు సంభవించే దేశాలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలి.
  • కోవిడ్-19తో ఊహించిన దానికంటే ముందుగా మరణాలు నమోదయ్యే ప్రాంతాలను గుర్తించి టీకాలు ఇవ్వాలి.
  • వైరస్‌తో పోరాడుతూనే ఆర్థికంగా ముందుకు వెళుతున్న దేశాలకు రెండో ప్రాధాన్యం ఇవ్వాలి. దీని వల్ల కోవిడ్ ప్రభావంతో ఏర్పడిన పేదరికాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు.
  • వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న దేశాలకు వ్యాక్సిన్ సరఫరా చేయాలి.


చదవండి:
పేద దేశాలకూ టీకా: డబ్ల్యూహెచ్‌ఓ

క్విక్ రివ్యూ :
ఏమిటి :19 మందితో కూడిన అంతర్జాతీయ ఆరోగ్య నిపుణుల బృందానికి నేతృత్వం
ఎప్పుడు : సెప్టెంబర్ 5
ఎవరు : ఎజెకీల్ జే ఎమ్మన్యూల్
ఎందుకు : కోవిడ్ టీకా పంపిణీ విధానాన్ని రూపొందించేందుకు

Published date : 07 Sep 2020 05:45PM

Photo Stories