Skip to main content

ఎవరి జయంతిని పరాక్రమ దివస్ పాటించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది?

భారత స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి జనవరి 23వ తేదీన ఇకనుంచి ‘‘పరాక్రమ దివస్’’గా పాటించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది.
Current Affairs

పరాక్రమ దివస్ సందర్భంగా 2021, జనవరి 23న పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో జరిగే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటారని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ జనవరి 19న వెల్లడించారు.

మంత్రి ప్రహ్లాద్ తెలిపిన వివరాల ప్రకారం...

  • బోస్ 125వ జయంతి(2021, జనవరి 23)ని పురస్కరించుకుని కోల్‌కతా నేషనల్ లైబ్రరీ గ్రౌండ్‌‌సలో ప్రధాని మోదీ ఎగ్జిబిషన్‌ను ప్రారంభిస్తారు.
  • బోస్ స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్(ఇండియన్ నేషనల్ ఆర్మీ,, ఐఎన్‌ఏ)లోని ప్రముఖులు, వారి కుటుంబీకులను ప్రధాని సన్మానిస్తారు.
  • 1938లో జాతీయ కాంగ్రెస్‌కు నేతాజీ అధ్యక్షుడిగా ఎన్నికైన గుజరాత్‌లోని సూరత్ జిల్లా హరిపురా గ్రామంలో కూడా ప్రత్యేక కార్యక్రమం జరగనుంది.
  • నేతాజీ 125వ జయంతి ఉత్సవాల నిర్వహణకు ప్రధాని మోదీ అధ్యక్షతన 85 మంది సభ్యులతో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటైంది.
  • ఐఎన్‌ఏ రెజిమెంటల్ మార్చ్ నినాదం ముందుకు సాగిపోదాం(కదమ్ కదమ్ బధాయే జా)ను బీటింగ్ రిట్రీట్ ఉత్సవంలో భాగంగా చేస్తారు.
  • ఎయిర్ ఇండియా విమాన సర్వీసుల్లో నేతాజీ ఫొటోలను ఉంచుతారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి జనవరి 23వ తేదీన ఇకనుంచి ‘‘పరాక్రమ దివస్’’గా పాటించాలి
ఎప్పుడు : జనవరి 19
ఎవరు : భారత ప్రభుత్వం
ఎందుకు : ప్రజల్లో ముఖ్యంగా యువతలో దేశభక్తిని ప్రేరేపించడమే లక్ష్యంగా
Published date : 21 Jan 2021 04:17PM

Photo Stories