ఎస్డీఆర్‌ఎంఎఫ్ కింద రాష్ట్రాలకు 11 వేల కోట్లు
Sakshi Education
కరోనాను ఎదుర్కొనేందుకు కేంద్రం ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు అత్యవసర నిధులను విడుదల చేసింది.
రాష్ట్ర విపత్తు ప్రమాద నిర్వహణ నిధి (ఎస్డీఆర్‌ఎంఎఫ్) కింద రాష్ట్రాలకు రూ. 11,092 కోట్లు విడుదల చేసేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆమోదం తెలిపారు. ఎస్‌డీఆర్‌ఎంఎఫ్‌కు తొలి విడత కింద ఈ నిధులు విడుదల చేయనున్నట్టు ఏప్రిల్ 3న హోంశాఖ పేర్కొంది. ఈ నిధులను క్వారంటైన్ కేంద్రాల ఏర్పాటు సహా ఇతర వ్యవహారాల కోసం ఉపయోగించుకోవచ్చని తెలిపింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : రాష్ట్రాలకు రూ. 11,092 కోట్లునిధులు విడుదల
ఎప్పుడు : ఏప్రిల్ 3
ఎవరు : కేంద్ర హోంశాఖ మంత్రి
ఎందుకు : ఎస్డీఆర్‌ఎంఎఫ్ కింద
Published date : 04 Apr 2020 04:37PM