Skip to main content

ఎస్‌బీఐ మేనేజింగ్ డెరైక్టర్‌గా చల్లా శ్రీనివాసులు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) మేనేజింగ్ డెరైక్టరుగా (ఎండీ) చల్లా శ్రీనివాసులు శెట్టిని నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఎండీగా బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి ఆయన మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు.
Current Affairsచల్లా శ్రీనివాసులు ప్రస్తుతం ఎస్‌బీఐలో డిప్యూటీ ఎండీగా విధులు నిర్వహిస్తున్నారు. మరోవైపు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా పనిచేస్తున్న లింగం వెంకట ప్రభాకర్ కెనరాబ్యాంకు ఎండీ-సీఈఓగా నియమితులయ్యారు. ఆయన పదవీ విరమణ చేసేంతవరకూ ఆ పదవిలో కొనసాగనున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీగా నియామకం
ఎవరు
: చల్లా శ్రీనివాసులు శెట్టి

మాదిరి ప్రశ్నలు

1. ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) చైర్మన్‌గా ఎవరు ఉన్నారు?
1. కిరణ్ మజుందార్ షా
2. చందా కొచ్చర్
3. రజనీష్ కుమార్
4. అరవింద సుబ్రమణ్యం

Published date : 21 Jan 2020 06:12PM

Photo Stories