Skip to main content

ఏరో ఇండియా-2019షోలో ‘రాఫెల్’

బెంగళూరు: రాజకీయ వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన రాఫెల్ యుద్ధ విమానాన్ని ఫిబ్రవరి 20న ఏరో ఇండియా-2019లో ప్రదర్శించారు.
సూర్య కిరణ్ ఏరోబేటిక్ బృందానికి చెందిన వింగ్ కమాండర్ సాహిల్ గాంధీ మృతికి నివాళిగా రాఫెల్ యుద్ధ విమానాన్ని సాధారణ వేగంతో నడిపారు. ఫిబ్రవరి 19న జరిగిన వైమానిక ప్రదర్శన సన్నాహాల్లో సూర్య కిరణ్, జెట్ విమానం ఢీకొనడం తెలిసిందే. ఈ ఘటనలో సాహిల్ మృతి చెందగా స్క్వాడ్రన్ లీడర్ తేజేశ్వర్ సింగ్, వింగ్ కమాండర్ విజయ్ శేల్కిలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే సాహిల్‌కు నివాళులర్పిస్తూ ఈ యుద్ధ విమానం సాధారణ వేగంతో ప్రదర్శన ఇచ్చింది. అయితే సూర్యకిరణ్ ఏరోబ్యాటిక్స్ బృందం మాత్రం ప్రదర్శనకు దూరంగా ఉండిపోయింది. ఏరో ఇండియాలో ప్రదర్శన ఇచ్చేందుకు ఫ్రాన్స్ వైమానిక దళానికి చెందిన రెండు రాఫెల్ యుద్ధ విమానాలను గత వారం భారత్‌కు తరలించారు. ఐదు రోజులపాటు జరగనున్న ఏరో ఇండియా వైమానిక ప్రదర్శన లో మొత్తం 61 విమానాలు పాల్గొననున్నాయి.

క్విక్ రివ్యూ :
ఏమిటి : ఏరో ఇండియా-2019 ‘రాఫెల్’ షో
ఎప్పుడు : ఫిబ్రవరి 20
ఎక్కడ : బెంగళూరు
ఎందుకు : వైమానిక ప్రదర్శన
Published date : 21 Feb 2019 06:08PM

Photo Stories