ఏపీలో వైఎస్సార్ వాహన మిత్ర పథకం
Sakshi Education
ఆంధ్రప్రదేశ్‌లోని ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు రాష్ట్ర ప్రభుత్వం అందించే ఆర్థికసాయానికి ‘వైఎస్సార్ వాహన మిత్ర పథకం’గా నామకరణం చేశారు.
ఈ విషయాన్ని రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ పీఎస్సార్ ఆంజనేయులు సెప్టెంబర్ 25న తెలిపారు. ఈ పథకం ద్వారా సొంతంగా ఆటోలు, ట్యాక్సీలు నడుపుకునే డ్రైవర్లకు రూ.10 వేలు ఆర్థిక సాయం అందుతుందన్నారు. వాహన బీమా, ఫిట్‌నెస్, మరమ్మతులకు ఈ సాయం ఉపయోగపడతుందని ఆయన పేర్కొన్నారు. 2019, అక్టోబర్ 5న లబ్ధిదారులకు నేరుగా చెల్లింపుల రశీదులు అందిస్తామని చెప్పారు.
Published date : 26 Sep 2019 07:59PM