Skip to main content

ఏపీలో మహిళా మిత్ర సేవలు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 8న ‘మహిళా మిత్ర’ సేవలను శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌తో కలిసి ఏపీ హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత ప్రారంభించారు.
విశాఖపట్నంలోని ఏయూ కన్వెన్షన్ హాల్లో మహిళా మిత్ర ప్రారంభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉమెన్ సేఫ్టీ ఇన్ సైబర్ స్పేస్’ అవగాహన సదస్సులోనూ మంత్రి సుచరిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వేధింపులకు గురవుతున్న మహిళలు పోలీస్‌స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేయడానికి భయపడుతున్నారన్నారు. అలాంటి వారు తమ సమస్యలను విన్నవించుకోవడానికి ప్రతి పోలీస్‌స్టేషన్‌లో ఒకరిద్దరు ‘మహిళా మిత్ర’ పోలీసులను నియమిస్తున్నట్లు తెలిపారు. మహిళలకు ఎలాంటి సైబర్ సమస్యలున్నా 9121211100కు వాట్సాప్ చేయాలని సూచించారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మహిళా మిత్ర సేవలు ప్రారంభం
ఎప్పుడు : ఆగ స్టు 8
ఎవరు : ఏపీ హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత
ఎక్కడ : విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
Published date : 09 Aug 2019 05:58PM

Photo Stories