ఏపీలో అవినీతిపై కాల్ సెంటర్ ప్రారంభం
Sakshi Education
అవినీతి రహిత పారదర్శక పాలన అందించాలన్న లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన కాల్ సెంటర్‌ను ప్రారంభించింది.
పౌరుల నుంచి వచ్చే ఫిర్యాదుల స్వీకరణకు ఏర్పాటు చేసిన 14400 కాల్ సెంటర్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నవంబర్ 25న తన క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. ‘ఎప్పుడైనా ఎక్కడైనా అవినీతి మీ దృష్టికి వస్తే వెంటనే గళం ఎత్తండి.. 14400 నంబర్‌కు ఫోన్ చేయండి’ అనే నినాదం ఉన్న పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఫిర్యాదు అందిన 15 రోజుల నుంచి 30 రోజుల్లోగా దర్యాప్తు పూర్తి చేసి దానిపై తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
ప్రభుత్వ శాఖల్లో అవినీతిని తగ్గించడానికి అధ్యయనం, సిఫార్సుల కోసం ప్రతిష్టాత్మక మేనేజ్‌మెంట్ సంస్థ అహ్మదాబాద్ ఐఐఎంతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న విషయం విదితమే. అలాగే ఇసుక అక్రమాలపై 14500 కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 14400 కాల్ సెంటర్ ప్రారంభం
ఎప్పుడు : నవంబర్ 25
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్
ఎందుకు : అవినీతి రహిత పారదర్శక పాలన అందించాలన్న లక్ష్యంతో

Published date : 26 Nov 2019 05:41PM