Skip to main content

ఏపీకి ఏడు జాతీయ జల పురస్కారాలు

ఆంధ్రప్రదేశ్‌కు ఏడు జాతీయ జల పురస్కారాలు లభించాయి.
ఢిల్లీలో ఫిబ్రవరి 25న నిర్వహించిన జాతీయ జల పురస్కారాలు-2018 ప్రధానోత్సవ కార్యక్రమంలో ఈ అవార్డులను అందజేశారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ చేతుల మీదుగా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రభుత్వ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, అధికారులు ఈ అవార్డులను అందుకున్నారు.

విభాగాల వారీగా అవార్డులు...
ఉత్తమ రాష్ట్రాల విభాగం- ఏపీకి తృతీయ పురస్కారం

నదుల పునరుజ్జీవన విభాగం
  1. కర్నూలు జిల్లా (కుందూ నది)కు మొదటి పురస్కారం
  2. కడప జిల్లా (పాపాఘ్ని నది)కు ప్రోత్సాహక బహుమతి

భూగర్భ జలం పెంపు విభాగం
  1. అనంతపురం జిల్లాకు ప్రథమ పురస్కారం
  2. విశాఖపట్నం జిల్లాకు ప్రోత్సాహక అవార్డు

నీటి నిర్వహణ విభాగం
  1. విశాఖపట్నంలోని జె.ఆర్.నగర్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్‌కు ఉత్తమ గృహ సముదాయ అవార్డు
  2. సింహాచలం శ్రీవరాహ లక్ష్మినరసింహస్వామి దేవస్థానంకు ఉత్తమ ఆధ్యాత్మిక సంస్థ అవార్డు

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఏపీకి ఏడు జాతీయ జల పురస్కారాలు
ఎప్పుడు : ఫిబ్రవరి 25
ఎవరు : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
ఎక్కడ : ఢిల్లీ
Published date : 26 Feb 2019 05:40PM

Photo Stories