ఏపీ సీఎం సలహాదారుగా సుభాష్‌చంద్ర గార్గ్
Sakshi Education
కేంద్ర ఆర్థిక శాఖలో కార్యదర్శిగా పనిచేసి పదవీ విరమణ చేసిన సుభాష్ చంద్ర గార్గ్.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అదనపు నిధులు సమీకరించే విషయంలో ముఖ్యమంత్రి సలహదారునిగా నియమితులయ్యారు.
ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ సాధారణ పరిపాలన విభాగం (పొలిటికల్) ముఖ్య కార్యదర్శి పవ్రీణ్ ప్రకాష్ మార్చి 1న ఉత్తర్వులు జారీచేశారు. కేబినేట్ మంత్రి హోదాలో ఆయన రెండేళ్ల పాటు ఈ బాధ్యతల్లో కొనసాగుతారు. నెలలో కనీసం 15 రోజులు పాటైనా ఆయన ఈ బాధ్యతల్లో పనిచేయాలని.. అలాగే, 7-10 రోజుల పాటు ఆయన రాష్ట్ర రాజధానిలోనే ఉండి పనిచేయాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఏపీ సీఎం సలహాదారుగా నియామకం
ఎప్పుడు : మార్చి 1
ఎవరు : సుభాష్ చంద్ర గార్గ్
ఎందుకు : అదనపు నిధులు సమీకరించే విషయంలో
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఏపీ సీఎం సలహాదారుగా నియామకం
ఎప్పుడు : మార్చి 1
ఎవరు : సుభాష్ చంద్ర గార్గ్
ఎందుకు : అదనపు నిధులు సమీకరించే విషయంలో
Published date : 02 Mar 2020 05:45PM