ఏపీ హైకోర్టు న్యాయమూర్తుల ప్రమాణం
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్‌రాయ్, జస్టిస్ మటం వెంకటరమణలు ప్రమాణం చేశారు.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కోర్టు హాల్లో జరిగిన కార్యక్రమలో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్ జూన్ 20న వీరితో ప్రమాణం చేయించారు.
జస్టిస్ మానవేంద్రనాథ్‌రాయ్ నేపథ్యం
విజయనగరం జిల్లా పార్వతీపురంలో 1964 మేలో చీకటి నరహరిరావు, విజయలక్ష్మి దంపతులకు జన్మించిన మానవేంద్రనాథ్‌రాయ్ విశాఖలోని ఎన్వీపీ న్యాయకళాశాలలో న్యాయశాస్త్రం అభ్యసించారు. 2002లో జిల్లా జడ్జి కేడర్‌లో జుడీషియల్ సర్వీసెస్‌కు ఎంపికయ్యారు. అప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో న్యాయసేవలు అందించారు. 2015 జులై నుంచి హైకోర్టు రిజి్ట్రార్ జనరల్‌గా సేవలు అందిస్తున్నారు. ఉమ్మడి హైకోర్టు విభజన సమయంలో కీలకపాత్ర పోషించారు.
జస్టిస్ వెంకటరమణ నేపథ్యం అనంతపురం జిల్లా గుత్తి చెందిన జస్టిస్ వెంకటరమణ 1982లో న్యాయ వాదిగా ఎన్‌రోల్ అయ్యారు. 1987లో జుడీషియల్ సర్వీసులోకి ప్రవేశించి వివిధ హోదాల్లో పనిచేశారు. వివిధ ప్రాంతాల్లో సేవలందించిన ఆయన హైదరాబాద్‌లోని సీబీఐ ప్రధాన కోర్టు జడ్జిగా పనిచేశారు. 2019, జనవరి 7 నుంచి కర్నూలు జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా (పీడీజే) విధులు నిర్వర్తిస్తున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఏపీ హైకోర్టు న్యాయమూర్తుల ప్రమాణం
ఎప్పుడు : జూన్ 20
ఎవరు : జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్‌రాయ్, జస్టిస్ మటం వెంకటరమణలు
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు

Published date : 21 Jun 2019 05:25PM