Skip to main content

ఏపీ బీసీ కమిషన్ చైర్మన్‌గా జస్టిస్ నారాయణ

ఆంధ్రప్రదేశ్ శాశ్వత బీసీ కమిషన్ చైర్మన్‌గా ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకర నారాయణను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈ నియామకానికి సంబంధించి ప్రభుత్వం త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయనుంది. బీసీ కమిషన్ సభ్యులుగా సామాజిక శాస్త్రవేత్త, వెనుకబడిన వర్గాలపై ప్రత్యేక అవగాహన కలిగిన ఇద్దరు వ్యక్తులు ఉంటారు. ప్రభుత్వ కార్యదర్శి కమిషన్ కార్యదర్శిగా వ్యవహరిస్తారు. బీసీ కమిషన్‌కు సివిల్ కోర్టుకు ఉండే అధికారాలుంటాయి. వెనుకబడిన తరగతుల సాధికారత, అభ్యున్నతికి సంబంధించిన వ్యవహారాలను బీసీ కమిషన్ పర్యవేక్షిస్తుంది.
Published date : 12 Sep 2019 04:03PM

Photo Stories