ఎన్‌సీసీ గణతంత్ర దినత్సోవ కార్యక్రమంలో మోదీ
Sakshi Education
భారత 70వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎన్‌సీసీ (నేషనల్ కాడెట్ కాప్స్) ఢిల్లీలో జనవరి 28న నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ... భారత్ శాంతికాముక దేశమే అయినా.. దేశ రక్షణ విషయంలో రాజీ పడబోదని తేల్చి చెప్పారు. ‘మీ భవిష్యత్తును నిర్దేశించేవి మీ కుటుంబం, మీ ఆర్థిక నేపథ్యం కాదు.. మీ పట్టుదల, మీ నైపుణ్యం, మీ ఆత్మవిశ్వాసమే బంగారు భవితకు బాటలు వేస్తుంది’ అని అన్నారు. వీఐపీ సంస్కృతి స్థానంలో తన ప్రభుత్వం ఈపీఐ(ఎవ్రీ పర్సన్ ఈజ్ ఇంపార్టెంట్- ప్రతీ వ్యక్తి ప్రముఖుడే) సంస్కృతిని చేర్చిందన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఎన్‌సీసీ గణతంత్ర దినత్సోవ కార్యక్రమం
ఎప్పుడు : జనవరి 28
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : ఢిల్లీ
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఎన్‌సీసీ గణతంత్ర దినత్సోవ కార్యక్రమం
ఎప్పుడు : జనవరి 28
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : ఢిల్లీ
Published date : 29 Jan 2019 05:19PM