ఎన్ఈపీలోచైనీస్ కు దక్కని చోటు
ఎన్ఈపీ-2020 ప్రకారం... సెకండరీ స్కూలులో సాధారణంగా ప్రతీ విద్యార్థికి వారికి ఆసక్తి ఉన్న విదేశీ భాషను నేర్చుకునే అవకాశం ఉంటుంది. వేర్వేరు దేశాల్లో సంస్కృతులు, ఆయా దేశాల్లో సామాజిక స్థితిగతులపై జ్ఞానాన్ని పెంచుకోవడం కోసం ఈ విదేశీ భాషల కేటగిరీని ప్రవేశపెట్టారు. 2019 ఏడాది విడుదల చేసిన ఎన్ఈపీ ముసాయిదా ప్రతిలో ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్, జపనీస్‌తో పాటుగా చైనీస్ భాష ఉంది. కానీ కేంద్రం తాజాగా ఆమోదించిన తుది ప్రతిలో చైనీస్‌ను తొలగించినట్టు జాతీయ మీడియాలో కథనాలొచ్చాయి. కేంద్ర మంత్రులు ప్రకాశ్ జవదేకర్, రమేష్ పోఖ్రియాల్ విడుదల చేసిన ఎన్ఈపీలో రష్యన్, పోర్చుగీస్, థాయ్ భాషలకు చోటు దక్కింది.
చదవండి: ఎన్‌ఈపీ 2020-సమగ్ర సమాచారం
క్విక్ రివ్యూ :
ఏమిటి : చైనా భాష చైనీస్ కు చోటు దక్కలేదు
ఎప్పుడు : ఆగస్టు 2
ఎక్కడ :నూతన జాతీయ విద్యావిధానం-2020 (ఎన్‌ఈపీ-2020)లో