ఎన్‌ఏఆర్‌ఎల్ రజతోత్సవాల్లో వెంకయ్య
Sakshi Education
తిరుపతికి సమీపంలోని గాదంకి జాతీయ వాతావరణ పరిశోధన సంస్థ (ఎన్‌ఏఆర్‌ఎల్) ప్రారంభించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న రజతోత్సవాల్లో జూన్ 3న భారత ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు పాల్గొన్నారు.
వాతావరణంలో వచ్చే మార్పులు, రోజు రోజుకు పెరిగిపోతున్న భూతాపంపై మరిన్ని పరిశోధనలు పెరగాలని ఈ సందర్భంగా వెంకయ్య పిలుపునిచ్చారు. వాతావరణం మార్పులపై కచ్చితమైన సమాచారం అందించే మార్గాలను అన్వేషించాలన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఎన్‌ఏఆర్‌ఎల్ రజతోత్సవాల్లో ఉపరాష్ట్రపతి
ఎప్పుడు : జూన్ 3
ఎవరు : ఎం. వెంకయ్యనాయుడు
ఎక్కడ : గాదంకి, తిరుపతి, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఎన్‌ఏఆర్‌ఎల్ రజతోత్సవాల్లో ఉపరాష్ట్రపతి
ఎప్పుడు : జూన్ 3
ఎవరు : ఎం. వెంకయ్యనాయుడు
ఎక్కడ : గాదంకి, తిరుపతి, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్
Published date : 04 Jun 2019 05:38PM