Skip to main content

ఎన్‌ఐఎన్ పేరిట తపాలా బిళ్ల ఆవిష్కరణ

పోషకాహార రంగ పరిశోధనల్లో వందేళ్లు పూర్తి చేసుకున్న జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్) పేరిట ఓ తపాలా బిళ్ల విడుదలైంది.
న్యూఢిల్లీలో అక్టోబర్ 17న జరిగిన కార్యక్రమంలో కేంద్ర శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన శాఖ మంత్రి హర్షవర్ధన్ ఈ తపాలా బిళ్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రఖ్యాత శాస్త్రవేత్త సి.గోపాలన్ పేరిట ఏర్పాటు చేసిన అవార్డును ఆయన కుమారుడు డాక్టర్ శరత్ గోపాలన్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐసీఎంఆర్ డెరైక్టర్ జనరల్ బలరామ్ భార్గవ, ఎన్‌ఐఎన్ డెరైక్టర్ డాక్టర్ ఆర్ హేమలత పాల్గొన్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఎన్‌ఐఎన్ పేరిట తపాలా బిళ్ల ఆవిష్కరణ
ఎప్పుడు : అక్టోబర్ 17
ఎవరు : కేంద్ర శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన శాఖ మంత్రి హర్షవర్ధన్
ఎక్కడ : న్యూఢిల్లీ
Published date : 18 Oct 2019 05:24PM

Photo Stories