Skip to main content

ఎంఆర్‌ఎస్‌ఏ మిస్సైల్‌ను తయారు చేసిన సంస్థ?

భారత రక్షణ శాఖ చేపట్టిన <b>మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్(ఎంఆర్‌ఎస్‌ఏ మిస్సైల్</b> ప్రయోగ పరీక్ష విజయవంతమైంది.
Current Affairs

ఒడిశా రాష్ట్రం బాలసోర్ జిల్లాలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్(ఐటీఆర్) నుంచి డిసెంబర్ 23న ఈ ప్రయోగ పరీక్షను నిర్వహించారు. గాల్లో ఎగిరే లక్ష్యాన్ని మిసైల్ కచ్ఛితంగా చేరుకుందని అధికార వర్గాలు తెలిపాయి.

ఎంఆర్‌ఎస్‌ఏ విశేషాలు...
  • భూ ఉపరితలం నుంచి గగనతల లక్ష్యాలను ఛేదించే ఎంఆర్‌ఎస్‌ఏను ఇజ్రాయిల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్‌తో కలిసి డీఆర్‌డీఓ సంయుక్తంగా రూపొందించింది.
  • భారత్ డైనమిక్ లిమిటెడ్(బీడీఎల్)లో దీన్ని తయారు చేశారు.
  • దాదాపు 100కి.మీ దూరంలోని లక్ష్యాలను ఈ మిసైల్ చేధించగలదు.
  • 4.5 మీటర్ల పొడవైన అణు సామర్థ్యం గల దీని బరువు సుమారు 2.7 టన్నులు. సుమారు 60కేజీల పేలోడ్‌ను ఇది మోసుకెళ్లగలదు.

చదవండి:
క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ (క్యూఆర్‌ఎస్‌ఏఎం) ప్రయోగం-వివరాలు

పీఎస్‌ఎల్‌వీ సీ-51 ప్రయోగం-వివరాలు, ఫిక్సల్ ఇండియా పేరుతో ఏ ప్రయోగాన్ని నిర్వహించనున్నారు?

క్విక్ రివ్యూ :
ఏమిటి : మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్(ఎంఆర్‌ఎస్‌ఏ) మిస్సైల్ ప్రయోగ పరీక్షవిజయవంతం
ఎప్పుడు : డిసెంబర్ 23
ఎవరు : భారత రక్షణ శాఖ
ఎక్కడ : చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్(ఐటీఆర్), బాలసోర్ జిల్లా, ఒడిశా
ఎందుకు : దేశ రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు
Published date : 24 Dec 2020 06:28PM

Photo Stories