Skip to main content

ఎమెస్కో సంస్థకు లోక్‌నాయక్ పురస్కారం

తెలుగుభాషాభివృద్ధికి విశేష కృషి చేస్తున్న ఎమెస్కో సంస్థకు లోక్‌నాయక్ ఫౌండేషన్ అవార్డు అందజేయనున్నట్లు ఫౌండేషన్ చైర్మన్ ప్రొఫెసర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ నవంబర్ 10న ప్రకటించారు.
2020 జనవరి 18న విశాఖపట్నంలోని వుడా బాలల థియేటర్‌లో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డు అందజేయనున్నట్లు వెల్లడించారు. ఎమెస్కో ప్రధాన కార్యనిర్వాహకుడు డి.విజయ కుమార్‌కు ఈ పురస్కారం కింద రూ.2 లక్షల నగదు, ప్రశంసాపత్రాన్ని అందజేస్తామన్నారు.

మరోవైపు విజ్ఞాన్ విద్యాసంస్థల అధినేత లావు రత్తయ్యకు జీవన సాఫల్య పురస్కారం కింద రూ.లక్ష నగదు అందజేస్తామని యార్లగడ్డ వివరించారు. లోక్‌నాయక్ ఫౌండేషన్ ద్వారా అందజేసే పురస్కార మొత్తాన్ని రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షలకు పెంచినట్లు చెప్పారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
లోక్‌నాయక్ ఫౌండేషన్ అవార్డు
ఎప్పుడు : నవంబర్ 10
ఎవరు : ఎమెస్కో సంస్థ

మాదిరిప్రశ్నలు
1. తెలుగుభాషాభివృద్ధికి విశేష కృషి చేస్తున్న ఏ సంస్థకు లోక్‌నాయక్ ఫౌండేషన్ అవార్డును ప్రకటించారు?
1. తెలుగు భారతి
2. ఎమెస్కో
3. నాంపల్లి తెలుగు యూనివర్శిటీ
4. విజ్ఞాన్ విద్యాసంస్థలు
సమాధానం : 2

2. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షునిగా ఎవరు ఉన్నారు?
1. మాడుగుల నాగఫణి శర్మ
2. పరుచూరి గోపాలకృష్ణ
3. గజ్జల మల్లారెడ్డి
4. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్
సమాధానం : 4
Published date : 11 Nov 2019 05:53PM

Photo Stories