ఎలుకలను పట్టే గ్లూట్రాప్‌లపై నిషేధం విధించిన రాష్ట్రం?
Sakshi Education
ఎలుకలను పట్టేందుకు వినియోగించే గ్లూట్రాప్ (జిగురుతో కూడిన ఉచ్చు)ల వినియోగాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది.
గ్లూట్రాప్స్‌తో ఎలుకలను పట్టడం అత్యంత క్రూరమైన విధానమని, ఎలుకలు వాటికి అతుక్కుపోయి తీవ్రనొప్పి, బాధను ఎదుర్కొంటాయని.. గ్లూట్రాప్‌ల వినియోగం జంతువులపై క్రూరత్వం నిషేధ చట్టం– 1960లోని సెక్షన్ 11 స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర పశుసంవర్థకశాఖ ఆగస్టు 20న ప్రత్యేక సర్క్యులర్ జారీ చేసింది.
విభజిత రాష్ట్రాల్లో ఒక్కచోటే రిజర్వేషన్
ఒక రాష్ట్రంలో రిజర్వేషన్ ఫలాలు అనుభవిస్తున్న వ్యక్తి సదరు రాష్ట్రం విభజనైతే ఏర్పడే రాష్ట్రాల్లో వేటిలోనైనా అదేవిధమైన రిజర్వేషన్‌కు అర్హుడని, కానీ ఏర్పడిన అన్ని రాష్ట్రాల్లో రిజర్వేషన్ పొందడం కుదరదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. బిహార్ విభజన అనంతరం ఏర్పడిన బిహార్, జార్ఖండ్ రాష్ట్రాలకు సంబంధించి కోర్టు ఈ తీర్పును వెల్లడించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఎలుకలను పట్టే గ్లూట్రాప్‌లపై నిషేధం విధించిన రాష్ట్రం?
ఎప్పుడు : ఆగస్టు 20
ఎవరు : తెలంగాణ
ఎక్కడ : తెలంగాణ
ఎందుకు : గ్లూట్రాప్‌ల వినియోగం జంతువులపై క్రూరత్వం నిషేధ చట్టం– 1960లోని సెక్షన్ 11 స్ఫూర్తికి విరుద్ధమని...

Published date : 21 Aug 2021 05:58PM