ఏఎన్-32 దుర్ఘటనలో 13మంది మృతి
Sakshi Education
అరుణాచల్‌ప్రదేశ్‌లో ఏఎన్-32 విమానం కుప్పకూలిన దుర్ఘటనలో విమానంలో ఉన్న 13 మంది మరణించినట్లు భారత వైమానిక దళం(ఐఏఎఫ్) జూన్ 13న తెలిపింది.
మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించింది. రష్యాలో తయారైన ఏఎన్-32 విమానం అస్సాంలోని జొహ్రాట్ ప్రాంతం నుంచి చైనా సరిహద్దులోని మెంచుకాకు జూన్ 3న బయల్దేరిన కొద్దిసేపటికే అదృశ్యమైన విషయం తెలిసిందే. అప్పటినుంచి గాలించగా 8 రోజుల తర్వాత సియాంగ్, షియోమి జిల్లాల సరిహద్దులో జూన్ 12న ఈ విమాన శకలాలు దొరికాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఏఎన్32 దుర్ఘటనలో 13మంది మృతి
ఎప్పుడు : జూన్ 13
ఎవరు : భారత వైమానిక దళం(ఐఏఎఫ్)
ఎక్కడ : సియాంగ్, షియోమి జిల్లాల సరిహద్దు, అరుణాచల్ ప్రదేశ్
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఏఎన్32 దుర్ఘటనలో 13మంది మృతి
ఎప్పుడు : జూన్ 13
ఎవరు : భారత వైమానిక దళం(ఐఏఎఫ్)
ఎక్కడ : సియాంగ్, షియోమి జిల్లాల సరిహద్దు, అరుణాచల్ ప్రదేశ్
Published date : 14 Jun 2019 05:34PM