ఏ దేశాధ్యక్షుడు ఇటీవల హత్యకు గురయ్యారు?
Sakshi Education
మధ్య ఆఫ్రికా దేశం చాద్‌ను మూడు దశబ్దాల పాటు పరిపాలించిన అధ్యక్షుడు ఇద్రిస్ దెబీ ఇత్నో(68) హత్యకు గురయ్యారు.
ఈ విషయాన్ని ఆ దేశ ఆర్మీ వెల్లడించింది. తిరుగుబాటు దారుల(రెబల్స్)తో పోరు సందర్భంగా ఏప్రిల్ 20న యుద్ధభూమిలో ఆయన మరణించినట్లు తెలిపింది. 2021, ఏప్రిల్ 11న చాద్‌లో అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో ఇద్రిస్ గెలుపొందినట్లు ప్రకటన వచ్చిన కొద్ది గంటల్లోనే ఆయన హత్యకు గురయ్యారు. 18 నెలల ట్రాన్సిషనల్ కౌన్సిల్‌ను ఆయన కుమారుడైన మహమత్ ఇద్రిస్ ఇత్మో (37) నడిపిస్తారని ఆర్మీ ప్రకటించింది. అధ్యక్షుడి మరణానికి కారణమైన రెబల్స్ పక్క దేశమైన లిబియాలో శిక్షణ తీసుకొని వచ్చినట్లు ఆర్మీ భావిస్తోంది. ఇద్రిస్ దెబీ 1990లో గద్దెనెక్కారు. అప్పటి నుంచి చాద్‌ను పాలిస్తున్నారు.
చాద్ రాజధాని: ఎండ్జమీనా(N'Djamena); కరెన్సీ: సెంట్రల్ ఆఫ్రికా సీఎఫ్‌ఏ ఫ్రాంక్
క్విక్ రివ్యూ :
ఏమిటి : హత్యకు గురైన చాద్ అధ్యక్షుడు
ఎప్పుడు : ఏప్రిల్ 20
ఎవరు : ఇద్రిస్ దెబీ ఇత్నో(68)
ఎక్కడ : చాద్
ఎందుకు : తిరుగుబాటు దారుల(రెబల్స్)తో పోరు సందర్భంగా
చాద్ రాజధాని: ఎండ్జమీనా(N'Djamena); కరెన్సీ: సెంట్రల్ ఆఫ్రికా సీఎఫ్‌ఏ ఫ్రాంక్
క్విక్ రివ్యూ :
ఏమిటి : హత్యకు గురైన చాద్ అధ్యక్షుడు
ఎప్పుడు : ఏప్రిల్ 20
ఎవరు : ఇద్రిస్ దెబీ ఇత్నో(68)
ఎక్కడ : చాద్
ఎందుకు : తిరుగుబాటు దారుల(రెబల్స్)తో పోరు సందర్భంగా
Published date : 21 Apr 2021 07:13PM