ఏ దేశ అధ్యక్షుడిపై ట్విట్టర్ శాశ్వత నిషేధం విధించింది?
Sakshi Education
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై సామాజిక మాధ్యమం ట్విట్టర్ శాశ్వత నిషేధం విధించింది.
ట్రంప్ ట్విట్టర్ ఖాతాను శాశ్వతంగా నిషేధిస్తున్నట్టుగా జనవరి 9న ప్రకటించింది. ఒక దేశాధినేత అకౌంట్‌ని శాశ్వతంగా తొలగించడం ఇదే తొలిసారి. కొద్ది రోజులుగా ట్విట్టర్ వేదికగా ట్రంప్ పెట్టే పోస్టులు హింసను ప్రేరేపించేలా ఉన్నాయని అందుకే తాజా నిర్ణయం తీసుకున్నట్టు ట్విట్టర్ తెలిపింది.
ఇప్పటికే...
ఇప్పటికే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడి హోదాలో ఉన్నంతవరకు ఆయన అకౌంట్‌ని బ్లాక్ చేస్తున్నట్టు ప్రకటించాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై శాశ్వత నిషేధం
ఎప్పుడు : జనవరి 9
ఎవరు : సామాజిక మాధ్యమం ట్విట్టర్
ఎందుకు : ట్రంప్ పెట్టే పోస్టులు హింసను ప్రేరేపించేలా ఉన్నాయని

Published date : 11 Jan 2021 05:55PM