ఏ ఆర్టికల్ ప్రకారం అసెంబ్లీల సీట్ల సంఖ్యను పెంచుతారు?
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న మేరకు ఏపీ, తెలంగాణల్లో అసెంబ్లీ నియోజకవర్గాలు పెంచుతున్నారా? అని మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఆగస్టు 3న లోక్‌సభలో రాతపూర్వకంగా ప్రశ్నించారు.
దీనికి కేంద్ర హోం శాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ స్పందిస్తూ ‘ఏపీ విభజన చట్టంలోని సెక్షన్ 15 ప్రభావంతో సంబంధం లేకుండా... రాజ్యాంగంలోని ఆర్టికల్ 170కి లోబడి ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 26(1) ప్రకారం ఏపీలో సీట్లు 175 నుంచి 225కు, తెలంగాణలో సీట్లు 119 నుంచి 153కు పెంచాలి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 170(3) ప్రకారం ప్రతి రాష్ట్రంలోని మొత్తం శాసనసభ స్థానాల సంఖ్య సర్దుబాటు 2026 అనంతరం తొలి జనగణన వివరాలు ప్రచురితమయ్యాకే ఉంటుంది’ అని సమాధానమిచ్చారు. మంత్రి చెప్పిన ప్రకారం... దేశంలోని అన్ని రాష్ట్రాలతోపాటే 2026 తర్వాతనే రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల సర్దుబాటు జరుగుతుంది.
Published date : 04 Aug 2021 05:52PM