‘ఎ’ అర్హత ప్రమాణాన్ని అధిగమించిన తొలి భారతీయ స్విమ్మర్?
Sakshi Education
ఒలింపిక్స్ స్విమ్మింగ్‌లో ‘ఎ’ అర్హత ప్రమాణాన్ని అధిగమించిన తొలి భారతీయ స్విమ్మర్‌గా సజన్ ప్రకాశ్ గుర్తింపు పొందాడు.
ఇటలీ రాజధాని రోమ్‌లో జరుగుతున్న సెట్టి కోలి ట్రోఫీ ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో కేరళకు చెందిన సజన్ ప్రకాశ్ 200 మీటర్ల బటర్‌ఫ్లయ్ ఈవెంట్‌లో ఈ ఘనత సాధించాడు. తద్వారా విశ్వ క్రీడలు ఒలిపింక్స్‌కు నేరుగా అర్హత పొందాడు. జూన్ 26న జరిగిన 200 మీటర్ల బటర్‌ఫ్లయ్ హీట్‌లో సజన్ 1ని:56.38 సెకన్లలో గమ్యానికి చేరి అగ్రస్థానాన్ని పొందాడు. ఈ క్రమంలో ఎట్టకేలకు టోక్యో ఒలింపిక్స్ ‘ఎ’ అర్హత ప్రమాణం 1ని:56.48 సెకన్లను అధిగమించి ఒలింపిక్ బెర్త్ సంపాదించాడు.
27 ఏళ్ల సజన్‌కిది వరుసగా రెండో ఒలింపిక్స్ కానుంది. 2016 రియో ఒలింపిక్స్‌లో సజన్ 200 మీటర్ల బటర్‌ఫ్లయ్ ఈవెంట్‌లో ఓవరాల్‌గా 28వ స్థానంలో నిలిచాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఒలింపిక్స్ స్విమ్మింగ్‌లో ‘ఎ’ అర్హత ప్రమాణాన్ని అధిగమించిన తొలి భారతీయ స్విమ్మర్?
ఎప్పుడు : జూన్ 26
ఎవరు : సజన్ ప్రకాశ్
ఎక్కడ : రోమ్, ఇటలీ

Published date : 28 Jun 2021 06:13PM