ఏ ఆఫ్రికా దేశంతో భారత్ సీఈసీపీఏ ఒప్పందం చేసుకుంది?
Sakshi Education
ఆఫ్రికా దేశమైన మారిషస్తో కీలకమైన ఆర్థిక సహకార, భాగస్వామ్య ఒప్పందం(సీఈసీపీఏ)పై భారత్ ఫిబ్రవరి 22న సంతకాలు చేసింది.
ఒక ఆఫ్రికా దేశంతో ఈ తరహా ఒప్పందం చేసుకోవడం భారత్‌కు ఇదే ప్రథమం. ఆఫ్రికా ఖండంలో వ్యూహాత్మక స్థానంలో ఉన్న మారిషస్‌తో ఈ ఒప్పందం భారత వాణిజ్య విస్తృతికి అవకాశం కల్పించనుంది. మారిషస్ రాజధాని పోర్ట్‌లూయిస్ జరిగిన సమావేశంలో ఈ ఒప్పందం కుదిరింది. ఒప్పంద కార్యక్రమంలో మారిషస్ ప్రధాని ప్రవింద్ జుగ్నాథ్, భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పాల్గొన్నారు.
ఇరు దేశాలకూ వాణిజ్య అవకాశాలు
సీఈసీపీఏ ఒప్పందం ఇటు భారత్, అటు మారిషస్ ఉత్పత్తులు, సేవలకు వాణిజ్య అవకాశాలను విస్తృతం చేయనుంది. ఇరు దేశాలు మరో దేశ ఉత్పత్తులు, సేవలకు ప్రత్యేక ప్రవేశ అవకాశాన్ని కల్పిస్తాయి. సుమారు 300 ఉత్పత్తులను భారత్ మారిషస్‌కు ఎగుమతి చేసేందుకు అవకాశం ఏర్పడనుంది.
మారిషస్ రాజధాని: పోర్ట్‌లూయిస్; కరెన్సీ: మారిషస్ రుపీ
మారిషస్ ప్రస్తుత అధ్యక్షుడు: పృథ్వీరాజ్‌సింగ్ రూపన్
మారిషస్ ప్రస్తుత ప్రధానమంత్రి: ప్రవింద్ జుగ్నాథ్
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆర్థిక సహకార, భాగస్వామ్య ఒప్పందం(సీఈసీపీఏ)పై సంతకాలు
ఎప్పుడు : ఫిబ్రవరి 22
ఎవరు : భారత్, మారిషస్
ఎక్కడ : పోర్ట్‌లూయిస్, మారిషస్
ఎందుకు : ఇరుదేశాల వాణిజ్య విస్తృతి కోసం

Published date : 23 Feb 2021 06:01PM