దుమ్ముగూడెం బహుళార్థ సాధక ప్రాజెక్టుకు ఆమోదం
Sakshi Education
గోదావరి నదిపై దుమ్ముగూడెం బహుళార్థ సాధక ప్రాజెక్టు నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
3,481.9 కోట్ల అంచనా వ్యయంతో దుమ్ముగూడెం బ్యారేజీ నిర్మాణానికి అనుమతిచ్చింది. బ్యారేజీకి అనుబంధంగా 320 మెగావాట్ల సామర్థ్యంతో జల విద్యుదుత్పత్తి కేంద్రం నిర్మించాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన డిసెంబర్ 11న సమావేశమైన మంత్రివర్గం ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకుంది. దుమ్ముగూడెం బ్యారేజీకి అయ్యే ఖర్చును రెండేళ్ల పాటు బడ్జెట్లలో కేటాయించాలని కేబినెట్ నిర్ణయించింది. 37 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో 63 మీటర్ల ఎత్తులో, భూసేకరణ అవసరం లేకుండా నదిలోనే నీళ్లు నిల్వ ఉండేలా బ్యారేజీ నిర్మాణం చేపట్టొచ్చని అధికారులు తెలిపారు. ఈ ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : దుమ్ముగూడెం బహుళార్థ సాధక ప్రాజెక్టు నిర్మాణానికి ఆమోదం
ఎప్పుడు : డిసెంబర్ 11
ఎవరు : తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం
ఎక్కడ : గోదావరి నది
క్విక్ రివ్యూ :
ఏమిటి : దుమ్ముగూడెం బహుళార్థ సాధక ప్రాజెక్టు నిర్మాణానికి ఆమోదం
ఎప్పుడు : డిసెంబర్ 11
ఎవరు : తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం
ఎక్కడ : గోదావరి నది
Published date : 12 Dec 2019 06:24PM