డిజాస్టర్ రెస్సాన్స్, ఎమర్జెన్సీ రెస్పాన్స్ వాహనాలు ప్రారంభం
Sakshi Education
ఏపీ అగ్నిమాపక, విపత్తుల నిర్వహణ శాఖతోపాటు పోలీస్ శాఖకు సమకూర్చిన 14 డిజాస్టర్ రెస్సాన్స్, 36 ఎమర్జెన్సీ రెస్పాన్స్ వాహనాలు డిసెంబర్ 31న ప్రారంభమయ్యియి.
గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఏపీఎస్‌పీ 6వ బెటాలియన్ గ్రౌండ్‌లోని వాహనాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో జెండా ఊపి ప్రారంభించారు.
కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ... అత్యాధునిక సౌకర్యాలు కలిగిన ఈ వాహనాలు దేశంలో ముంబై తర్వాత మన రాష్ట్రంలోనే అందుబాటులోకి వచ్చాయన్నారు. విపత్తు నిర్వహణ, అత్యవసర సేవల కోసం ప్రభుత్వం ఈ వాహనాలను అందించిందన్నారు. కంట్రోల్ రూమ్ నుంచి ఘటనా స్థలిని ఈ వాహనాల ద్వారా వీక్షించొచ్చని పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 14 డిజాస్టర్ రెస్సాన్స్, 36 ఎమర్జెన్సీ రెస్పాన్స్ వాహనాలు ప్రారంభం
ఎప్పుడు : డిసెంబర్ 31
ఎవరు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి
ఎక్కడ : ఏపీఎస్‌పీ 6వ బెటాలియన్ గ్రౌండ్, మంగళగిరి, గుంటూరు జిల్లా
ఎందుకు : విపత్తు నిర్వహణ, అత్యవసర సేవల కోసం

Published date : 01 Jan 2021 06:08PM