Skip to main content

దేవాపూర్ మైన్స్ కు జాతీయస్థాయి పురస్కారాలు

తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎండీసీ) ఆధ్వర్యంలో కొనసాగుతున్న దేవాపూర్ లైమ్‌స్టోన్స్ మైన్స్ జాతీయ స్థాయిలో ఐదు బహుమతులు గెలుచుకుంది.
మైన్స్ ఎన్విరాన్‌మెంట్ అండ్ మినరల్ కన్జర్వేషన్ వీక్ 2018-19 పేరుతో నిర్వహించిన పోటీలో దేవాపూర్ మైన్స్ ఈ బహుమతులు దక్కించుకుంది. మినరల్ కన్జర్వేషన్ విభాగంతో పాటు మరో రెండు విభాగాల్లో తొలి బహుమతి, వేస్ట్ డంప్ మేనేజ్‌మెంట్‌లో రెండో బహుమతి, మినరల్ బెనిఫిసియేషన్ విభాగంలో మూడో బహుమతి పొందింది.
Published date : 07 Feb 2019 05:54PM

Photo Stories