Skip to main content

డేటా అండ్‌ ఏఐ నివేదిక ఆవిష్కరణ

నేషనల్‌ అసోసియేషన్ ఆఫ్‌ సాఫ్ట్‌వేర్‌ అండ్‌ సర్వీసెస్‌ కంపెనీస్‌ (నాస్కాం) రూపొందించిన ‘అన్లాక్‌ వాల్యూ ఫ్రం డేటా అండ్‌ ఏఐ : ద ఇండియన్ ఆపర్చునిటీ’ నివేదిక విడుదలైంది.
Current Affairs
ఆగస్టు 18న జరిగిన వర్చువల్‌ కాన్ఫరెన్స్ లో కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ ఈ నివేదికను ఆవిష్కరించారు. కోవిడ్‌ సంక్షోభం నుంచి భారత్‌ పటిష్టంగా ఎదిగేందుకు ఈ నివేదిక దోహదం చేస్తుందని నాస్కాం ప్రెసిడెంట్‌ దేబ్జానీ ఘోష్‌ తెలిపారు.

ఎక్స్‌పీరియన్స్ ఏఐసమ్మిట్‌..
తెలంగాణ ఏఐ మిషన్ భాగస్వామ్యంతో 2020, సెప్టెంబర్‌ 1–4 తేదీల్లో ఎక్స్‌పీరియన్స్ ఏఐసమ్మిట్‌ను నిర్వహించనున్నట్లు నాస్కాం వెల్లడించింది. సమ్మిట్‌ ద్వారా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ రంగ నిపుణులు, కంపెనీలు, సంస్థలు ఒకే వేదికపైకి రానున్నాయి. అలాగే భారత్‌ పునరుద్ధరణకు, వృద్ధికి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ ఏ విధంగా దోహదం చేస్తుందో ఓ కార్యాచరణకు రూపకల్పన చేస్తారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి : అన్లాక్‌ వాల్యూ ఫ్రం డేటా అండ్‌ ఏఐ : ద ఇండియన్ ఆపర్చునిటీనివేదిక ఆవిష్కరణ
ఎప్పుడు : ఆగస్టు 18
ఎవరు : కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌
Published date : 19 Aug 2020 05:20PM

Photo Stories