Skip to main content

దేశంలో తొలి బుల్లెట్ రైలు ఏ రెండు నగరాల మధ్య నడవనుంది?

<b>ముంబై-అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ ప్రాజెక్టు(ఎంఏహెచ్‌ఎస్‌ఆర్)</b>లో భాగంగా నడిపే బుల్లెట్ రైలు చిత్రాన్ని జపాన్ రాయబార కార్యాలయం మొదటిసారిగా డిసెంబర్ 19న విడుదల చేసింది.
Edu news

ముంబై-అహ్మదాబాద్ మధ్య నడవనున్న ‘‘5 సిరీస్ షింకాన్‌సెన్ రైలింజన్’’కు కొన్ని మార్పులు చేయనున్నట్లు వెల్లడించింది. ముంబై, అహ్మదాబాద్‌ల మధ్య 508 కిలోమీటర్ల పొడవైన ఈ ప్రాజెక్టు 2023 ఏడాది కల్లా పూర్తి చేయాల్సి ఉంది. సుమారు రూ.1,10,000 కోట్ల ఈ ప్రాజెక్టుకు జపాన్ ప్రభుత్వం సాంకేతిక, ఆర్థిక సాయం(రుణం) అందిస్తుంది.

చదవండి: ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు ఎక్కడ శంకుస్థాపన చేశారు?

Published date : 22 Dec 2020 06:51PM

Photo Stories