దేశంలో చిరుతల సంఖ్య తగ్గింది: సీడబ్ల్యూఎస్
Sakshi Education
దేశవ్యాప్తంగా చిరుతల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు బెంగళూరులోని వన్య జీవుల అధ్యయన కేంద్రం (సెంటర్ ఫర్ వైల్డ్‌లైఫ్ స్టడీస్- సీడబ్ల్యూఎస్) వెల్లడించింది.
వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఐఐ)తో కలిసి తాము నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైందని పేర్కొంది. పశ్చిమ కనుమలు, దక్కన్ పీఠభూమి, ఉత్తర భారత శివాలిక్ పర్వతాల్లో ఎక్కువగా సంచరించే చిరుతల సంఖ్య 70-90శాతం తగ్గినట్లు తెలిపింది. గత 120-200 ఏళ్లలో ఈ చిరుతల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు వివరించింది. ఆక్యుపెన్సీ మోడలింగ్ విధానంతో చిరుతలను లెక్కించగా అనువంశికత దృష్ట్యా చిరుతల సముదాయం వైవిధ్యతను కోల్పొయిందని సీడబ్ల్యూఎస్ చెప్పింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : చిరుతల సంఖ్య గణనీయంగా తగ్గింది
ఎప్పుడు : ఫిబ్రవరి 7
ఎవరు : వన్య జీవుల అధ్యయన కేంద్రం (సెంటర్ ఫర్ వైల్డ్‌లైఫ్ స్టడీస్- సీడబ్ల్యూఎస్)
ఎక్కడ : దేశవ్యాప్తంగా
క్విక్ రివ్యూ :
ఏమిటి : చిరుతల సంఖ్య గణనీయంగా తగ్గింది
ఎప్పుడు : ఫిబ్రవరి 7
ఎవరు : వన్య జీవుల అధ్యయన కేంద్రం (సెంటర్ ఫర్ వైల్డ్‌లైఫ్ స్టడీస్- సీడబ్ల్యూఎస్)
ఎక్కడ : దేశవ్యాప్తంగా
Published date : 08 Feb 2020 06:04PM