Skip to main content

దేశంలో 100వ కిసాన్ రైలు ఏ రెండు ప్రాంతాల మధ్య ప్రారంభమైంది?

దేశంలో 100వ కిసాన్ రైలు సర్వీసు ప్రారంభమైంది. డిసెంబర్ 28న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా ఈ రైలు సర్వీసును ప్రారంభించారు.
Current Affairs
మహారాష్ట్రలోని సాంగోలా నుంచి పశ్చిమబెంగాల్‌లోని షాలిమార్ వరకు ఈ రైలు నడవనుంది. రైతుల కోసం తెచ్చిన కిసాన్ రైల్‌లో రిఫ్రిజిరేటర్ కోచ్‌లు ఉంటాయి. త్వరగా పాడైపోయే పండ్లు, కూరగాయలు వంటి వాటిని తరలించడానికి రైలు ఉపయుక్తంగా ఉంటుంది. తక్కువ ధరలకే రైతుల పంటలను రవాణా చేసేందుకు ఇది ఉపకరిస్తుంది. రైతులు తమ ఉత్పత్తులను నిల్వ చేసుకోవడానికి వీలుగా రైల్వే స్టేషన్లకు దగ్గరలో రైల్ కార్గో సెంటర్లను నిర్మిస్తున్నామని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

చదవండి:
దక్షిణాదిలో తొలి కిసాన్ రైలును ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?

దేశంలో తొలి కిసాన్ రైలు ఎప్పడు, ఎక్కడ ప్రారంభమైంది?

క్విక్ రివ్యూ :
ఏమిటి : దేశంలో 100వ కిసాన్ రైలు సర్వీసు ప్రారంభం
ఎప్పుడు : డిసెంబర్ 28
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : మహారాష్ట్రలోని సాంగోలా నుంచి పశ్చిమబెంగాల్‌లోని షాలిమార్ వరకు
ఎందుకు : రైతులు త్వరగా పాడైపోయే పండ్లు, కూరగాయలు వంటి వాటిని తరలించడానికి
Published date : 29 Dec 2020 05:38PM

Photo Stories