Skip to main content

దేశీయంగా తొలిసారి హైడ్రాలిక్‌ రిగ్స్‌ను తయారు చేసిన సంస్థ?

చమురు, ఇందనం వెలికితీసే హైడ్రాలిక్‌ రిగ్స్‌ విభాగంలోకి మౌలిక రంగ సంస్థ మేఘా ఇంజనీరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ (ఎంఈఐఎల్‌) ప్రవేశించింది.
Current Affairs
దేశంలో తొలిసారిగా స్వదేశీ పరిజ్ఞానంతో వీటిని తయారు చేసి వినియోగంలోకి తెచ్చిన ఘనతను కంపెనీ సొంతం చేసుకుంది. గుజరాత్‌ అహ్మదాబాద్‌లోని కలోల్‌ చమురు క్షేత్రంలో ఏర్పాటు చేసిన తొలి రిగ్‌ తన కార్యకలాపాలను ఏప్రిల్‌ 7న మొదలు పెట్టింది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో హైడ్రాలిక్‌ వ్యవస్థతో పనిచేసేలా దీనిని రూపొందించారు. భూ ఉపరితలం నుంచి 4,000–6,000 మీటర్ల లోతు వరకు చమురు బావులను ఇవి సులభంగా తవ్వుతాయి.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : దేశీయంగా తొలిసారి హైడ్రాలిక్‌ రిగ్స్‌ను తయారు చేసిన సంస్థ?
ఎప్పుడు : ఏప్రిల్‌ 7
ఎవరు : మేఘా ఇంజనీరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ (ఎంఈఐఎల్‌)
ఎక్కడ : కలోల్‌ చమురు క్షేత్రం, అహ్మదాబాద్, గుజరాత్‌
Published date : 09 Apr 2021 11:50AM

Photo Stories