దేశ ఫారెక్స్ నిల్వల చరిత్రాత్మక రికార్డు
Sakshi Education
భారత్ విదేశీ మారక ద్రవ్య నిల్వలు జూన్ 4వ తేదీతో ముగిసిన వారంలో 600 బిలియన్ డాలర్లను దాటాయి.
దేశ ఫారెక్స్ నిల్వలు ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. మే 28వ తేదీతో ముగిసిన వారంతో పోల్చిచూస్తే నిల్వలు 6.842 బిలియన్ డాలర్లు ఎగసి 605.008 డాలర్లకు చేరినట్లు ఆర్‌బీఐ జూన్ 11న విడుదల చేసిన గణాంకాలు తెలిపాయి. 2020 జూన్ 5తో ముగిసిన వారంలో మొట్టమొదటిసారి భారత్ ఫారెక్స్ నిల్వలు అర ట్రిలియన్ మార్క్‌దాటి 501.70 బిలియన్ డాలర్లకు చేరాయి. ప్రస్తుత నిల్వలు భారత్ 20 నెలల దిగుమతులకు దాదాపు సరిపోతాయన్నది అంచనా. అంతర్జాతీయంగా భారత్ ఎకానమీకి వచ్చే కష్టనష్టాలను, ఒడిదుడుకులను ఎదుర్కొనడానికి ప్రస్తుత స్థాయి నిల్వలు దోహదపడతాయి. ఫారెక్స్‌లో భాగమైన పసిడి నిల్వల విలువ 37.604 బిలియన్ డాలర్లకు ఎగసింది.
Published date : 12 Jun 2021 07:02PM