డబ్ల్యూటీటీ కంటెండర్ టోర్నీలో టైటిల్ సాధించిన జోడీ?
Sakshi Education
హంగేరి రాజధాని నగరం బుడాపెస్ట్‌లో జరుగుతున్న వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) కంటెండర్ టోర్నీలో భారత స్టార్ టేబుల్ టెన్నిస్ క్రీడాకారులు మనిక బాత్రా, సత్యన్ జోడికి టైటిల్ లభించింది.
ఆగస్టు 20న జరిగిన మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్లో మనిక–సత్యన్ జోడీ 3–1 (11–9, 9–11, 12–10, 11–6)తో ఆతిథ్య హంగేరీకి చెందిన 94వ ర్యాంక్ డోర మదరస్జ్–నండోర్ ఎక్సెకీ జంటపై విజయం సాధించింది.
జూనియర్ ప్రపంచ రెజ్లింగ్‌లో రజతం గెలిచిన భారతీయులు?
రష్యాలోని వుఫా నగరంలో జరగుతున్న జూనియర్ ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండు రజత పతకాలు లభించాయి. ఆగస్టు 20న స్వర్ణం కోసం తలపడిన మహిళా రెజ్లర్లు సంజూ దేవి, భటేరిలు రజతాలతో సంతృప్తి చెందారు. 62 కేజీల ఫైనల్లో రష్యా రెజ్లర్ ఎలీనా కసబియెవా 10–0 పాయింట్ల తేడాతో సంజూను ఓడించింది. 65 కేజీల ఫైనల్లో మాల్డొవా రెజ్లర్ ఇరినా రింగాసి 12–2 తేడాతో భటేరిపై గెలుపొందింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) కంటెండర్ టోర్నీలో టైటిల్ సాధించిన జోడీ?
ఎప్పుడు : ఆగస్టు 20
ఎవరు : మనిక బాత్రా, సత్యన్
ఎక్కడ : బుడాపెస్ట్, హంగేరి
ఎందుకు : ఫైనల్లో మనిక–సత్యన్ జోడీ హంగేరీకి చెందిన 94వ ర్యాంక్ డోర మదరస్జ్–నండోర్ ఎక్సెకీ జంటపై విజయం సాధించినందున...

Published date : 21 Aug 2021 06:00PM