Century Plyboards: రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో సెంచురీ ప్లై యూనిట్ ఏర్పాటు కానుంది?
Sakshi Education
ప్రముఖ ప్లైవుడ్ తయారీ సంస్థ సెంచురీ ప్లై... వైఎస్సార్ కడప జిల్లా బద్వేల్‌లో తయారీ యూనిట్ ఏర్పాటు చేయనుంది.
ఆగస్టు 25న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మెహన్‌రెడ్డిని క్యాంపు కార్యాలయంలో కలిసిన సెంచురీ ప్లై బోర్డ్స్ ఇండియా లిమిటెడ్ ప్రతినిధులు... యూనిట్ ఏర్పాటుకు సంబంధించి తమ ప్రణాళికలను సీఎంకు వివరించారు. రూ.వెయ్యి కోట్ల పెట్టుబడితో ఈ యూనిట్‌ను నెలకొల్పనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.
మూడు దశల్లో...
ప్లైవుడ్, బ్లాక్ బోర్డ్, మీడియం డెన్సిటీ ఫైబర్ బోర్డ్, పార్టికల్ బోర్డ్‌ల తయారీలో దేశంలోనే అత్యంత పెద్ద పరిశ్రమగా గుర్తింపు పొందిన సెంచురీప్లై బద్వేల్‌లో మూడు దశల్లో యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. 2024 నాటికి 3 దశలు పూర్తి చేయనుంది. తొలి దశలో 4 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో యూనిట్‌ను పూర్తి చేసి 2024 నాటికి 10 లక్షల టన్నులకు తీసుకెళ్లనుంది. ఈ యూనిట్ ద్వారా ప్రత్యక్షంగా 3 వేల మందికి లభించనుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : రూ.వెయ్యి కోట్ల పెట్టుబడితో తయారీ యూనిట్ ఏర్పాటు
ఎప్పుడు : ఆగస్టు 25
ఎవరు : ప్రముఖ ప్లైవుడ్ తయారీ సంస్థ సెంచురీ ప్లై
ఎక్కడ : బద్వేల్, వైఎస్సార్ కడప జిల్లా
ఎందుకు : ప్లైవుడ్, బ్లాక్ బోర్డ్, మీడియం డెన్సిటీ ఫైబర్ బోర్డ్, పార్టికల్ బోర్డ్‌ల తయారీ కోసం...

Published date : 26 Aug 2021 06:31PM