చంద్రయాన్-2 తొలి ఫొటోలు విడుదల
Sakshi Education
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) జూలై 22వ తేదీన ప్రయోగించిన చంద్రయాన్-2 తొలిసారి అంతరిక్షం నుంచి తీసిన భూమి ఫొటోలను పంపింది.
ప్రస్తుతం చంద్రయాన్-2 భూమికి-చంద్రుడికి మధ్యలోని భూమధ్యంతర కక్ష్యలో పరిభ్రమిస్తోంది. ఆగస్టు 3న సాయంత్రం 5.28 గంటలకు భూమిని ఉత్తరం ధృవం వైపు నుంచి చంద్రయాన్-2 తీసిన ఐదు ఫొటోలను ఆగస్టు 4న ఇస్రో విడుదల చేసింది. చంద్రయాన్-2లో ఉన్న ల్యాండర్ (విక్రమ్)లో ఎల్-14 కెమెరా ఈ చిత్రాలను తీసింది.
Published date : 05 Aug 2019 05:48PM