చంద్రయాన్ 2 ద్వారా లేజర్ పరికరాలు
Sakshi Education
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) చేపట్టిన ‘చంద్రయాన్ 2’మిషన్ ద్వారా భూమికి, చంద్రుడికి మధ్య ఉన్న దూరాన్ని కచ్చితత్వంతో కొలిచే లేజర్ పరికరాలను పంపనున్నట్లు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా తెలిపింది.
అమెరికాలోని టెక్సాస్‌లో జరిగిన లూనార్ అండ్ ప్లానిటరీ సైన్స్ కాన్ఫెరెన్స్ లో ఈ మేరకు వెల్లడించింది. ఇలాంటి ఐదు పరికరాలు ఇప్పటికే చంద్రుడి ఉపరితలంపై ఉన్నా.. వాటిలో కొన్ని లోపాలు తలెత్తాయని ఇటలీలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ న్యూక్లియర్ లేబొరేటరీకి చెందిన శాస్త్రవేత్త సైమన్ డెల్ యాగ్నెల్లో వెల్లడించారు. 2019, ఏప్రిల్‌లో చంద్రయాన్ 2ని ప్రయోగించనున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : చంద్రయాన్ 2 ద్వారా లేజర్ పరికరాలు
ఎప్పుడు : మార్చి 25
ఎవరు : అమెరికా అంతరిక్ష సంస్థ నాసా
ఎందుకు : భూమికి, చంద్రుడికి మధ్య ఉన్న దూరాన్ని కచ్చితత్వంతో కొలిచేందుకు
క్విక్ రివ్యూ :
ఏమిటి : చంద్రయాన్ 2 ద్వారా లేజర్ పరికరాలు
ఎప్పుడు : మార్చి 25
ఎవరు : అమెరికా అంతరిక్ష సంస్థ నాసా
ఎందుకు : భూమికి, చంద్రుడికి మధ్య ఉన్న దూరాన్ని కచ్చితత్వంతో కొలిచేందుకు
Published date : 26 Mar 2019 05:34PM