Skip to main content

చంద్రుడి కక్ష్యలోకి చంద్రయాన్-2

ఇప్పటివరకు లూనార్ ట్రాన్‌‌సఫర్ ట్రాజెక్టరీలో చక్కర్లు కొడుతున్న చంద్రయాన్-2 అంతరిక్ష నౌక చంద్రుడి కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించింది.
బెంగళూరు సమీపంలో బైలాలులోని భూనియంత్రిత కేంద్రం (మిషన్ ఆపరేటర్ కంట్రోల్ సెంటర్) నుంచి ఇస్రో చంద్రయాన్-2 కక్ష్య దూరాన్ని పెంచే ప్రక్రియను విజయవంతంగా నిర్వహించింది. ఆగస్టు 20న ఉదయం 9.02 గంటల ప్రాంతంలో ఆర్బిటర్‌లోని ద్రవ ఇంజిన్‌ను 1,738 సెకన్లపాటు మండించి అంతరిక్ష నౌకను 114×18072 కిలోమీటర్ల చంద్రుని కక్ష్యలో(లూనార్ ఆర్బిట్)కి ఇస్రో ప్రవేశపెట్టింది.

ఇప్పటిదాకా జరిగింది ఇదీ..
  • ఈ ఏడాది జూలై 22న చంద్రయాన్-2ను ఇస్రో విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రయోగించింది.
  • ఆగస్టు 14న చంద్రుడి కక్ష్యగతి మార్గంలోకి మళ్లించారు.
  • ఆగస్టు 20న చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించింది.
జరగబోయేది ఇదీ..
  • సెప్టెంబర్ 7న ఉదయం 1.55 గంటలకు ప్రజ్ఞాన్ రోవర్‌తో కూడిన విక్రమ్ ల్యాండర్ (1,471 కేజీల బరువు) చంద్రుడి ఉపరితలంపై అడుగుపెడుతుంది.
  • ఆ తర్వాత ల్యాండర్ నుంచి ప్రజ్ఞాన్ రోవర్ విడిపోయి, చంద్రుడిపై అన్వేషణ ప్రారంభిస్తుంది.
  • చంద్రయాన్ ఆర్బిటర్ చంద్రుడి కక్ష్యలో తిరుగుతూ.. అక్కడి విశేషాలను భూమిపైకి పంపుతూ ఉంటుంది.
Published date : 21 Aug 2019 06:35PM

Photo Stories