చిన్న పరిశ్రమల వృద్ధిపై సిన్హా కమిటీ
Sakshi Education
లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) అభివృద్ధిపై సలహాలు ఇచ్చేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) జనవరి 2న యూకే సిన్హా కమిటీని ఏర్పాటుచేసింది.
ఎనిమిది మంది సభ్యులతో ఏర్పాటు చేసిన ఈ కమిటీకి మార్కెట్ రెగ్యులేటర్ సెబీ మాజీ చైర్మన్ యూకే సిన్హా నేతృత్వం వహించనున్నారు. ఈ కమిటీ 2019 జూన్ నాటికి తన నివేదికను సమర్పిస్తుంది. ఎంఎస్‌ఎంఈ రంగానికి సంబంధించి ఆర్థిక, ద్రవ్య స్థిరత్వానికి దీర్ఘకాలిక సూచనలను కమిటీ చేయనుంది. మొత్తం ఎగుమతుల్లో ఎంఎస్‌ఎంఈ వాటా 40 శాతం కాగా తయారీ రంగంలో ఈ విభాగం వాటా 45 శాతంగా ఉంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : చిన్న పరిశ్రమల వృద్ధిపై యూకే సిన్హా కమిటీ ఏర్పాటు
ఎప్పుడు : జనవరి 2
ఎవరు : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
క్విక్ రివ్యూ :
ఏమిటి : చిన్న పరిశ్రమల వృద్ధిపై యూకే సిన్హా కమిటీ ఏర్పాటు
ఎప్పుడు : జనవరి 2
ఎవరు : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
Published date : 03 Jan 2019 05:01PM