చెన్నైలో సింధు పేరుతో బ్యాడ్మింటన్ అకాడమీ
Sakshi Education
చెన్నై సమీపంలోని కోలపాక్కంలో ఉన్న ఓమెగా ఇంటర్నేషనల్ స్కూల్‌లో ప్రపంచ చాంపియన్, భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు పేరుతో బ్యాడ్మింటన్ అకాడమీ, స్టేడియం ఏర్పాటు కానుంది.
‘హార్ట్‌ఫుల్‌నెస్ ఇన్‌స్టిట్యూట్’ ఆధ్వర్యంలో నిర్మితం కానున్న ఈ అకాడమీకి ఫిబ్రవరి 19న పీవీ సింధు శంకుస్థాపన చేశారు. మొత్తం 8 కోర్టులతో అత్యాధునిక హంగులతో నిర్మించనున్న ఈ అకాడమీని 18 నుంచి 24 నెలల్లో పూర్తిచేయనున్నారు. అకాడమీలో 1000 మంది ప్రేక్షకులు సౌకర్యంగా కూర్చునే ఏర్పాట్లు చేయనున్నారు. కమలేశ్ పటేల్ ఆధ్వర్యంలో హార్ట్‌ఫుల్‌నెస్ ఇన్‌స్టిట్యూట్ పనిచేస్తుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : పీవీ సింధు పేరుతో బ్యాడ్మింటన్ అకాడమీ, స్టేడియం ఏర్పాటు
ఎప్పుడు : ఫిబ్రవరి 19
ఎవరు : హార్ట్‌ఫుల్‌నెస్ ఇన్‌స్టిట్యూట్
ఎక్కడ : ఓమెగా ఇంటర్నేషనల్ స్కూల్, కోలపాక్కం, చెన్నై
క్విక్ రివ్యూ :
ఏమిటి : పీవీ సింధు పేరుతో బ్యాడ్మింటన్ అకాడమీ, స్టేడియం ఏర్పాటు
ఎప్పుడు : ఫిబ్రవరి 19
ఎవరు : హార్ట్‌ఫుల్‌నెస్ ఇన్‌స్టిట్యూట్
ఎక్కడ : ఓమెగా ఇంటర్నేషనల్ స్కూల్, కోలపాక్కం, చెన్నై
Published date : 20 Feb 2020 07:19PM