Skip to main content

చెల్లింపుల డేటా భారత్‌లోనే ఉండాలి: ఆర్‌బీఐ

పేమెంట్ సిస్టమ్ ఆపరేటింగ్ సంస్థలు (పీఎస్‌వో) చెల్లింపుల లావాదేవీల డేటా మొత్తం భారత్‌లోని సిస్టమ్స్‌లోనే భద్రపర్చాల్సి ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది.
ఈ మేరకు జూన్ 26న డేటా లోకలైజేషన్ నిబంధనలపై ఆర్‌బీఐ స్పష్టతనిచ్చింది. అవసరమైతే డేటాను విదేశాల్లో ప్రాసెస్ చేయొచ్చని... కానీ దాన్ని 24 గంటల్లోగా భారత్‌కు మార్చాల్సి ఉంటుందని, విదేశీ సర్వర్ల నుంచి తొల గించాల్సి ఉంటుం దని తేల్చిచెప్పింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
చెల్లింపుల డేటా భారత్‌లోనే ఉండాలి
ఎప్పుడు : జూన్ 26
ఎవరు : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
Published date : 27 Jun 2019 05:45PM

Photo Stories