చైనాలో ప్రమాదకర కరొనా వైరస్ వ్యాప్తి
Sakshi Education
చైనాలో ప్రమాదకర ‘నావల్ కరొనా’ వైరస్ వ్యాప్తి చెందుతోంది.
చైనాలో ఈ వైరస్ 41 మందికి సోకగా, ఒకరు మృతి చెందారని ఆదేశం జనవరి 11న ప్రకటించింది. కరోనా వైరస్ వ్యాప్తికి చైనాలోని ఉహాన్ నగరం ప్రధాన కేంద్రంగా ఉందని భావిస్తున్నారు. 2002-2003 మధ్య చైనాలో 349 మంది, హాంకాంగ్‌లో 299 మంది మరణాలకు కారణమైన ‘సార్స్ (సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్)’ సూక్ష్మజీవి జాతికి చెందిన వైరస్ ఇది. ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్ లేనప్పటికీ చైనాలో ఒకరి నుంచి ఒకరికి దగ్గు, తుమ్ముల ద్వారా కూడా ఈ వ్యాధి సోకుతోందని గుర్తించారు.
హెచ్చరికలు
కరొనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో చైనా వెళ్లే భారతీయులకు కేంద్రప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. అంతేగాక చైనా నుంచి తిరిగివస్తున్న యాత్రికులను కేంద్ర ఆరోగ్య శాఖ థర్మల్ స్కానర్లతో పరీక్షిస్తోంది.
సూచనలు
వైరస్ గురించి ఎక్కువగా తెలియకపోయినప్పటికీ కొన్ని జాగ్రత్తలను భారత ప్రభుత్వం సూచిస్తోంది. చైనాకు వెళ్తే పొలాలకు, జంతుశాలలకు, జంతువధ స్థానాలకు వెళ్లవద్దని తెలిపింది. మాంసానికి దూరంగా ఉండాలని, ఒకవేళ తినాల్సి వస్తే బాగా ఉడికించిన మాంసాన్ని తీసుకోవాల్సిందిగా సూచించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రమాదకర ‘నావల్ కరొనా’ వైరస్ వ్యాప్తి
ఎప్పుడు : జనవరి 17
ఎక్కడ : చైనా
మాదిరి ప్రశ్నలు

1. వైరస్ల గురించి అధ్యయనం చేసే శాస్త్రం?
1. ఆగ్రోస్టాలజీ
2. వైరాలజీ
3. బాక్టీరియాలజీ
4. మయాలజీ
- View Answer
- సమాధానం : 2
2. క్లినికల్ థర్మోమీటర్ ఆవిష్కర్త?
1. సర్ థామస్ అల్బట్
2. ఐయాన్ డోనాల్డ్
3. రీన్ లానిక్
4. ఎడ్వర్డ్ జెన్నర్
- View Answer
- సమాధానం : 1
Published date : 18 Jan 2020 05:51PM