Skip to main content

చైనాలో భారత గణతంత్ర వేడుకలు రద్దు

చైనాలో ప్రాణాంతక కరోనా వైరస్ రోజురోజుకీ విజృంభిస్తోన్న నేపథ్యంలో చైనాలో భారత రాయబార కార్యాలయం 2020 భారత గణతంత్ర వేడుకల్ని రద్దు చేసింది.
Current Affairsబహిరంగ ప్రదేశాల్లో ప్రజలు గుమిగూడటం, సభలు, సమావేశాలపై చైనా ప్రభుత్వం నిషేధం విధించడంతో జనవరి 24న ఈ నిర్ణయం తీసుకుంది.

కొత్త సంవత్సర వేడుకలకి దూరం
చైనాలో జనవరి 25న కొత్త సంవత్సరం ప్రవేశిస్తోంది. ఏటా వసంత రుతువుకి స్వాగతం పలుకుతూ పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుపుతారు. కానీ, కరోనా వైరస్ కారణంగా ప్రజలెవరూ ఈ వేడుకల్ని జరుపుకోవడం లేదు. ప్రభుత్వం కూడా అధికారిక ఉత్సవాల్ని రద్దు చేసింది.

26కి చేరిన మృతుల సంఖ్య
చైనాలో కరోనా వైరస్ సోకి మృతి చెందిన వారి సంఖ్య జనవరి 24న నాటికి 26కి చేరుకుంది. తాజాగా మరో 880 మంది ఈ వైరస్‌తో న్యుమోనియా బారినపడ్డారు.

10 రోజుల్లో ఆస్పత్రి నిర్మాణం
కరోనా వైరస్ సోకిన వారికి చికిత్సచేసేందుకు ప్రత్యేకంగా వెయి్య పడకల ఆస్పత్రిని వుహాన్‌లో నిర్మిస్తున్నట్టు చైనా ప్రభుత్వం ప్రకటించింది. కేవలం 10 రోజుల్లో ప్రీ ఫాబ్రికేటెడ్ విధానంలో దీని నిర్మాణం పూర్తయ్యేలా నిరంతరాయంగా పనులు చేయిస్తున్నారు. దాదాపు 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 1,000 పడకలు కలిగిన ఆస్పత్రిని నిర్మించనున్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
2020 భారత గణతంత్ర వేడుకలు రద్దు
ఎప్పుడు : జనవరి 24
ఎవరు : చైనాలో భారత రాయబార కార్యాలయం
ఎక్కడ : చైనా
ఎందుకు : ప్రాణాంతక కరోనా వైరస్ రోజురోజుకీ విజృంభిస్తోన్న నేపథ్యంలో
Published date : 25 Jan 2020 05:33PM

Photo Stories