Skip to main content

చైనా ప్రయాణికులకు భారత్ ఇ-వీసా రద్దు

చైనా నుంచి వచ్చే ప్రయాణికులు, ఆ దేశంలోని ఇతర దేశస్తులకు ఇ-వీసా సౌకర్యాన్ని భారత్ తాత్కాలికంగా రద్దు చేసింది.
Current Affairsప్రత్యేక ఆరోగ్య పరిస్థితుల్ని(కరోనా వైరస్ వ్యాప్తి) దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు బీజింగ్‌లో భారత రాయబార కార్యాలయం ఫిబ్రవరి 2న ప్రకటించింది. ఇక అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాలు చైనా మీదుగా ప్రయాణించే వారిని కూడా తమ దేశంలోకి రానివ్వకూడదని నిర్ణయం తీసుకున్నారు.

చైనాలో బర్డ్ ఫ్లూ భయం
కరోనా వైరస్‌తోనే నానాయాతన పడుతున్న చైనాలో హెచ్5ఎన్1 బర్డ్ ఫ్లూ వ్యాధి బయల్పడింది. హుబాయ్ ప్రావిన్స్ కు దక్షిణ సరిహద్దుల్లో హువాన్ ప్రావిన్స్ లో ఈ వ్యాధి బయటకి వచ్చింది. షోయాంగ్ నగరంలోని పౌల్ట్రీలో ఈ వైరస్ బయటపడినట్టు చైనా వ్యవసాయం, గ్రామీణ వ్యవహారాల శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. అక్కడ 7,850 కోళ్లు ఉంటే, 4,500 కోళ్లు ఈ వ్యాధితో చనిపోయాయి. మరో 17,828 కోళ్లను వ్యవసాయాధికారులే చంపేశారు. ఇప్పటికింకా మనుషులకు ఈ వ్యాధి సోకలేదు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
చైనా ప్రయాణికులకు ఇ-వీసా రద్దు
ఎప్పుడు : ఫిబ్రవరి 2
ఎవరు : భారత్
ఎందుకు : కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో
Published date : 04 Feb 2020 05:14PM

Photo Stories