చైనా నిర్మించిన హైపర్‌సోనిక్ జెట్ ఇంజిన్ పేరు?
Sakshi Education
ద్వని వేగం కన్నా 16 రెట్లు అధిక వేగంతో పయనించే హైపర్ సోనిక్ జెట్ ఇంజన్ <b>''సోరమ్ జెట్(sodramjet)''</b>ను చైనా విజయవంతంగా పరీక్షించింది.
బీజింగ్‌లోని జేఎఫ్12 టన్నెల్‌లో ఈ ఇంజిన్‌ను పరీక్షించారు. సోరమ్ జెట్ మాక్ 9 వేగాన్ని సాధించిందని సౌత్ చైనా మార్నింగ్ పోస్టు తెలిపింది.
మాక్ 9 వేగం లెక్కప్రకారం...
సాధారణ ధ్వనివేగం గంటకు 767 మైళ్లు. దీన్ని ఒక మాక్‌గా చెపుతారు.మాక్ 16 అంటే ధ్వనివేగానికి 16 రెట్లు అధికం, అంటే సుమారు గంటకు 12300 మైళ్ల వేగానికి సమానం. అయితే ఇంత వేగాన్ని తట్టుకునే పరీక్షా టన్నెల్స్ ప్రపంచంలో ఎక్కడాలేవు. మాక్ 9 వేగం సాధించిన లెక్కప్రకారం గణించి సోరమ్ జెట్ ఇంజన్ మాక్ 16ను చేరగలదని అంచనాకు వచ్చారు.
సొరమ్ జెట్ విశేషాలు...

- సొరమ్ జెట్‌గా పిలిచే హైపర్ సోనిక్ జెట్ ఇంజిన్‌ను మామూలు విమానాలకు తగిలిస్తే రెండు గంటల్లో ప్రపంచంలో ఎక్కడికై నా ప్రయాణించవచ్చు.
- ఈ ఇంజిన్‌తో సాధారణ విమానాలు సైతం భూకక్ష్యలో ఎగిరేంత శక్తి పొందుతాయి.
- ప్రస్తుతం వాడే ఇంజిన్లకు భిన్నంగా దీన్ని రూపొందించారు.
- సాధారణంగా మాక్ 7 దాటాక హైపర్‌సోనిక్ ఇంజిన్లు ఆగిపోతుంటాయి, కానీ ఈ ఇంజను మాక్ 9ను సాధించింది.
- చైనాలోనే మాక్ 16 వేగం తట్టుకునే పరీక్షా టన్నెల్‌ను నిర్మిస్తున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ‘సోరమ్ జెట్(sodramjet)’ అనేహైపర్‌సోనిక్ జెట్ ఇంజిన్ పరీక్ష
ఎప్పుడు : డిసెంబర్ 2
ఎవరు : చైనా
ఎక్కడ : జేఎఫ్12 టన్నెల్, బీజింగ్, చైనా
Published date : 03 Dec 2020 05:32PM