భవన నిర్మాణ అనుమతుల జారీకి టీఎస్-బీపాస్‌ను ప్రారంభించిన రాష్ట్రం?
Sakshi Education
భవన నిర్మాణ అనుమతుల జారీకి తెలంగాణ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన తెలంగాణ స్టేట్ బిల్డింగ్ పర్మిషన్ అప్రూవల్ సిస్టం(టీఎస్-బీపాస్) ప్రారంభమైంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : తెలంగాణ స్టేట్ బిల్డింగ్ పర్మిషన్ అప్రూవల్ సిస్టం(టీఎస్-బీపాస్) ప్రారంభం
ఎప్పుడు : నవంబర్ 16
ఎవరు : తెలంగాణ పురపాలక మంత్రి కె.తారకరామారావు
ఎక్కడ : ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీ, హైదరాబాద్
ఎందుకు : భవన నిర్మాణ అనుమతుల జారీకి
హైదరాబాద్‌లోని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీ)లో నవంబర్ 16న జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర పురపాలక మంత్రి కె.తారకరామారావు టీఎస్-బీపాస్‌ను ప్రారంభించారు. అనంతరం స్వీయ ధ్రువీకరణ ద్వారా ఇళ్లకు అనుమతి పొందిన పలువురు దరఖాస్తుదారులకు అనుమతి పత్రాలు అందజేశారు. ఈ టీఎస్-బీపాస్ ప్రారంభం సందర్భంగా మంత్రి కేటీఆర్ ప్రసంగించారు.
మంత్రి కేటీఆర్ ప్రసంగం...
- టీఎస్-బీపాస్ ద్వారా జారీ చేసే తక్షణ ఇళ్ల అనుమతులకు చట్టబద్ధత ఉంటుంది.
- 75 చదరపు గజాల లోపు స్థలంలో నిర్మించే ఇళ్లకు అనుమతులు అవసరం లేదని, రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుంది.
- 75 నుంచి 300 చదరపు గజాలలోపు స్థలంలో ఇళ్ల నిర్మాణం కోసం టీఎస్-బీపాస్ వెబ్‌సైట్‌లో స్వీయ ధ్రువీకరణ ద్వారా దరఖాస్తు చేసుకున్న వెంటనే ఆటోమెటిక్‌గా అనుమతులు జారీ అవుతాయి.
- 2021, జనవరి లేదా ఫిబ్రవరిలో కొత్త జీహెచ్‌ఎంసీ చట్టం తీసుకొస్తున్నాం.
క్విక్ రివ్యూ :
ఏమిటి : తెలంగాణ స్టేట్ బిల్డింగ్ పర్మిషన్ అప్రూవల్ సిస్టం(టీఎస్-బీపాస్) ప్రారంభం
ఎప్పుడు : నవంబర్ 16
ఎవరు : తెలంగాణ పురపాలక మంత్రి కె.తారకరామారావు
ఎక్కడ : ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీ, హైదరాబాద్
ఎందుకు : భవన నిర్మాణ అనుమతుల జారీకి
Published date : 17 Nov 2020 05:23PM